కాసేపట్లో ఇంటికి చేరుకుంటామనుకున్న ఇద్దరు యువకులను రోడ్డు ప్రమాదం బలిగొంది. ఈ ఘటన బుధవారం రాత్రి రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సర్దార్‌నగర్‌లో చోటుచేసుకుంది. షాబాద్ నుంచి షాద్‌నగర్ వెళ్తున్న కంటెయినర్ అతివేగంగా వెళ్తూ... బోల్తాకొట్టి స్కూటీపై వెళ్తున్న ఇద్దరు యువకులపై పడింది. దీంతో ఆ ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులు కక్కులూరుకు చెందిన ముట్పూరు విక్రాంత్ (19), పాపిరెడ్డిగూడెంనకు చెందిన పవన్(18)లుగా గుర్తించారు. వారిలో ఒకరు బైక్ మెకానిక్, మరొకరు కారు మెకానిక్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం లారీ డ్రైవర్ అతివేగం, అజాగ్రత్త వల్లే జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పారిపోయినట్లు సమాచారం.
ఇదీ చూడండి: ACCIDENT: అమెరికాకు వెళ్లాల్సినవాడు.. అనంతలోకాలకు చేరాడు