రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాకలో రోడ్డు ప్రమాదం జరిగింది. నాలుగు లైన్ల వంతెనపై ఓ లారీని.. డీసీఎం వ్యాన్ ఢీ కొట్టడం వల్ల ఇద్దరు మృతి చెందారు. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
వ్యానులో చిక్కుకున్న వారిని స్థానికులు కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ పశ్చిమ బంగాకు చెందిన బోసన్, తారిఫ్ మృతిచెందారు.
డీసీఎంలో ప్రయాణిస్తున్న ఉస్మాన్, సలావుద్దీన్, జాకీర్, అర్జున్ చికిత్స పొందుతున్నారు. వీరంతా కరీంనగర్ జిల్లా కొత్తపల్లి సమీపంలోని మిక్సింగ్ ప్లాంట్లో వలస కూలీలుగా పనిచేస్తున్నారు.
ఇదీ చూడండి: రెండు వాహనాలను ఢీకొట్టిన అంబులెన్స్.. ఇద్దరికి తీవ్ర గాయాలు