తొమ్మిదిరోజుల పాటు దుర్గామాతకు(DurgaDevi) భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. చివరి రోజున పూజ చేసి.. ఊరంతా ప్రసాదాలు పంచారు. మేళతాళాలు, మంగళవాద్యాల నడుమ ఊరేగింపు నిర్వహించారు. ఊరంతా అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నాక.. ఇక అమ్మను గంగమ్మ ఒడికి(DurgaDevi immersion in khammam) చేర్చేందుకు బయలుదేరారు. డీజేపాటల నడుమ స్టెప్పులేస్తూ ఎంతో ఉత్సాహంగా అమ్మవారిని సాగనంపేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఊళ్లో మొదలు పెట్టి శివారు వరకు డ్యాన్సులు చేస్తూ.. అమ్మను స్మరిస్తూ.. గంగమ్మ ఒడికి చేర్చడానికి తీసుకెళ్లారు. కానీ... ఊరంతా కోలాహలంగా ఉన్న ఆ తరుణంలో వాళ్లిద్దరికి తమను మృత్యువు వెంటాడుతోందని తెలియలేదు.
నిమజ్జనంలో అపశ్రుతి
ఖమ్మం జిల్లాలో దుర్గామాత విగ్రహ నిమజ్జనంలో అపశ్రుతిTragedy in DurgaDevi Immersion చోటుచేసుకుంది. కల్లూరు మండలం రఘునాథగూడెంలో శనివారం అర్ధరాత్రి దుర్గామాతను నిమజ్జనం చేస్తుండగా.. కాలువలో పడి ఇద్దరు గల్లంతయ్యారుTragedy in DurgaDevi Immersion. అక్కడే ఉన్న స్థానికులు వాళ్లని రక్షించేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. అప్పటికే వారు కంటికి కనబడకుండా కొట్టుకుపోయారు.
ఒకరు మృతి.. మరొకరి కోసం గాలింపు..
వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనాస్థలానకిి చేరుకున్న అధికారులు గాలింపు మొదలుపెట్టారు. గల్లంతైన వారిలో కంభంపాటి మధులత మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మరొకరు పసుపులేటి శివకోసం సాగర్ కాలువలో గాలిస్తున్నారు.