ETV Bharat / crime

వ్యవసాయ బావిలో పడి ఇద్దరు వ్యక్తులు మృతి - Two people fell in well

వేసవి తాపం తీర్చుకునేందుకు వ్యవసాయ బావిలోకి దిగి ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన ఘటన వికారాబాద్ జిల్లా మల్కాపూర్​లో జరిగింది. వీరిలో ఒకరి మృతదేహం లభించగా మరొకరిది లభించాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

people
ఇద్దరు వ్యక్తులు మృతి
author img

By

Published : Apr 11, 2021, 10:41 PM IST

వ్యవసాయ బావిలో పడి ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన ఘటన వికారాబాద్ జిల్లా మల్కాపూర్​లో చోటుచేసుకుంది. మహిపాల్, కృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు ఎండ నుంచి ఉపశమనం పొందడానికి ఓ వ్యవసాయ బావిలో ఈత కొట్టేందుకు బావిలో దూకారు.

కృష్ణకు మాత్రమే ఈత రాగా... మహిపాల్​కు ఈత రాదు. మహిపాల్ శవం తేలగా గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నీటిలో తేలిన శవాన్ని బయటకు తీసి మరో మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. గట్టు మీద ఉన్న బట్టల ఆధారంగా మృతులను గుర్తించారు.

కాగా.. ఈత వచ్చిన కృష్ణ చనిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మృతులు మహిపాల్​కు భార్య లక్ష్మి, మూడేళ్ల కూతురు భాగ్యశ్రీ, ఐదేళ్ల కుమారుడు అవినాశ్​ ఉన్నారు. మరో మృతుడు కృష్ణకు భార్య రేణుక, ఆరు నెలల పాప ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేపట్టారు.

ఇదీ చూడండి: సాగర్​లో ప్రత్యేక వ్యూహం... సామాజికవర్గాల వారిగా పార్టీల ప్రచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.