ETV Bharat / crime

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.. కారులో కిలోన్నర బంగారం

కారు బోల్తా పడి ఇద్దరు బంగారం వ్యాపారులు మృతి చెందిన విషాద ఘటన పెద్దపల్లి జిల్లా మల్యాలపల్లి వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. డ్రైవర్​ నిద్రమత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని తెలిసింది.

కారు బోల్తా పడి ఇద్దరు మృతి
కారు బోల్తా పడి ఇద్దరు మృతి
author img

By

Published : Feb 23, 2021, 7:32 AM IST

Updated : Feb 23, 2021, 11:13 AM IST

పెద్దపల్లి జిల్లా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు బంగారు వ్యాపారులు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. రామగుండం ఎన్టీపీసీ సమీపంలోని మల్యాలపల్లి రైల్వే బ్రిడ్జి మూలమలుపు వద్ద ఈ కారు ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటంతో పాటు కారు అతివేగంగా వెళ్లి బోల్తా పడింది. దీంతో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల వారిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. కారులో కిలోన్నరకు పైగా బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డిక్కీలో ఉన్న మూడు బ్యాగులు ఓపెన్ చేయగా పదుల సంఖ్యలో ప్యాకిట్ బుక్స్ లభ్యం అయ్యాయి. బాధితులు బంగారు వ్యాపారులుగా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు.మృతులు క్షతగాత్రులు గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన వారుగా గుర్తించారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.. కారులో కిలోన్నర బంగారం

బంగారం వ్యాపారం చేసే కొత్త రాంబాబు, కొత్త శ్రీనివాస్, శ్రీనివాస్ బావమరిది సంతోష్ మరో వ్యక్తి కారులో రామగుండం మీదుగా బెల్లంపల్లి వైపు వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. కారు బోల్తా పడడం వల్ల నలుగురు అందులో ఇరుక్కుపోయారు. స్థానికులు గమనించి బయటకు తీసే లోపే బంగారం వ్యాపారం చేసే రాంబాబు ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రికి తరలించగా శ్రీనివాస్ మృతి చెందారు. డ్రైవర్ సంతోష్, శ్రీనివాస్ బావమరిది సంతోష్​కు తీవ్రగాయాలు కాగా... వారిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను రామగుండం ఏరియా ఆసుపత్రిలో ఉంచారు. కారులో కిలోన్నర బంగారం లభించింది. ముందుగా సంఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది బంగారం ప్యాకెట్లను రామగుండం పోలీసులకు అప్పగించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.

ఇదీ చదవండి: మర్మాంగాలకు కోడి కత్తి తగలడంతో వ్యక్తి మృతి

Last Updated : Feb 23, 2021, 11:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.