ETV Bharat / crime

కుటుంబం ఆత్మహత్యాయత్నం ఘటనలో మహిళ మృతి.. పిల్లలు ఎలా ఉన్నారంటే..! - తెలంగాణ క్రైం న్యూస్

family suicide attempt in Nizamabad: నిజామాబాద్​ జిల్లాలో తీవ్ర విషాదం నింపిన అప్పుల బాధ భరించలేక కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటనలో మహిళ రేఖ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత రాత్రి మృతి చెందింది. జిల్లాలోని జానకంపేటకు చెందిన సాయి కుటుంబం ఈ నెల 14వ తేదీన పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. అదే రోజు సాయి మృతి చెందగా గత రాత్రి రేఖ మృతి చెందింది. పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

family suicide attempt in Nizamabad
family suicide attempt in Nizamabad
author img

By

Published : Dec 18, 2022, 6:25 PM IST

Updated : Dec 18, 2022, 7:06 PM IST

family suicide attempt in Nizamabad: నిజామాబాద్​ జిల్లాలో తీవ్ర విషాదం నింపిన కుటుంబం ఆత్మహత్యాయత్నం కేసులో గత రాత్రి మహిళ రేఖ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం జిల్లాలోని ఏడపల్లి మండలం జానకంపేట గ్రామానికి చెందిన సాయి.. దినసరి కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దీంతో భార్య రేఖ, ఇద్దరు కుమారులు చరణ్‌, అరుణ్‌లతో కలిసి ఈనెల 14వ తేదీన రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

ఇది గమనించిన బంధువులు హుటాహుటీనా జిల్లా ఆసుపత్రికి తరలించగా.. సాయి అదే రోజు మరణించాడు. రేఖ, పిల్లలు మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతుండుగా పిల్లలు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ప్రకటించిన డాక్టర్లు.. రేఖ పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉందని ముందు నుంచి చెప్పుకొస్తున్నారు. గత రాత్రి ఆమె మృతి చెందడంతో శవ పంచనామా చేసిన డాక్టర్లు.. బంధువులకు మృతదేహాం అప్పగించారు. రేఖ మరణంతో స్వగ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

"ఈనెల 14వ తేదీనా ఏడపల్లి మండలం జానకంపేట గ్రామానికి చెందిన సాయి కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సాయి ఆ రోజే మృతి చెందగా.. రేఖ గత రాత్రి మృతి చెందింది. బంధువులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. దర్యాప్తు కొనసాగుతోంది. అప్పులు ఇచ్చిన వారు మానసికంగా ఇబ్బంది పెట్టడం వలన వారు ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. పిల్లల ఆరోగ్యం నిలకడగా ఉంది".- శ్రీనివాస్ రాజు, సర్కిల్ ఇన్​స్పెక్టర్​ బోధన్

family suicide attempt in Nizamabad
family suicide attempt in Nizamabad

ఇవీ చదవండి:

Last Updated : Dec 18, 2022, 7:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.