మద్యం మత్తులో అతి వేగంగా ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ ఇద్దరు మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లా దుండిగల్‌లో చోటుచేసుకుంది. దుండిగల్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి గండిమైసమ్మ వైపు మనోజ్, దినేష్ సాయి అనే వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. మద్యం మత్తులో వేగంగా వెళ్తున్న క్రమంలో.. వారు అదుపుతప్పి డివైడర్‌ని బలంగా ఢీ కొట్టారు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని అంబులెన్స్‌లో గాంధీ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. మద్యం మత్తులో అతివేగంగా ద్విచక్రవాహనం నడిపినట్లు పోలీసులు తెలిపారు. మనోజ్ స్థానికంగా ఓ హోటల్లో పనిచేస్తుండగా... దినేష్ సాయి సెక్యురిటీ గార్డుగా విధులు నిర్వహిస్తుంటాడని పోలీసులు గుర్తించారు. ఘటనపై దుండిగల్ పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: ఆటోను ఢీకొన్న వ్యాన్.. ముగ్గురు దుర్మరణం