ETV Bharat / crime

బ్లాక్​లో రెమ్​​డెసివిర్​ను విక్రయిస్తోన్న ఇద్దరు అరెస్ట్​ - బ్లాక్​లో కరోనా టీకా

ఆపత్కాలంలో ప్రజల అవసరాలను సొమ్ము చేసుకునేందుకు.. ఇద్దరు అక్రమార్కులు చీకటి వ్యాపారానికి ద్వారాలు తెరిచారు. బ్లాక్​లో.. రెమ్​డెసివిర్​ ఇంజక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తూ పోలీసులకు చిక్కారు. మేడ్చల్​ జిల్లా మల్కాజిగిరి పట్టణంలో ఇది జరిగింది.

arrest
arrest
author img

By

Published : May 26, 2021, 10:32 PM IST

మేడ్చల్​ జిల్లాలో.. బ్లాక్​లో రెమ్​డెసివిర్​ ఇంజక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తోన్న ఇద్దరిని మల్కాజిగిరి ఎస్​ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 6 టీకాలు, 2 మొబైల్​ ఫోన్​లను స్వాధీనం చేసుకున్నారు.

నిందితులు.. సంకీర్త్, నెమలి కుమార్​లు రూ.15 వేలకు రెమ్​డెసివిర్​ను విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు అనంతరం.. వారిని రిమాండ్​కు తరలించారు. బ్లాక్​ మార్కెట్​కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామమని హెచ్చరించారు.

ఇదీ చదవండి: Geethanjali: డేటింగ్​ యాప్​లో నటి గీతాంజలి ఫొటోలు.. పోలీసులకు ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.