ETV Bharat / crime

rape attempt on child: ట్యూషన్​కి వచ్చిన పాపపై టీచర్ అత్యాచారయత్నం.. - చిన్నారి పై ట్యూషన్ మాస్టర్ అత్యాచారయత్నం

rape attempt on child: తమ కూతురుకి విద్యాబుద్ధులు నేర్పిస్తాడని ఆ తల్లిదండ్రులు అతని దగ్గరకి ట్యూషన్​కి పంపించారు. అదే వారికి శాపంగా మారింది. చదువుకున్న వాడైనప్పటికీ విచక్షణ జ్ఞానం కోల్పోయి కామంతో.. లోకజ్ఞానం కూడా తెలియని ఆరేళ్ల చిన్నారిపై మానవమృగంలా లైంగికదాడికి యత్నించాడు. ఈ అమానవీయ ఘటన హైదరాబాద్​లోని జవహర్​నగర్ పరిధిలో జరిగింది.

rape attempt on child
చిన్నారిపై అత్యాచారయత్నం
author img

By

Published : Feb 12, 2022, 12:18 PM IST

Updated : Feb 12, 2022, 2:22 PM IST

rape attempt on child: ఎన్ని చట్టాలొచ్చినా.. ఎన్ని కఠినమైన శిక్షలు అమలుచేస్తున్నా.. కామాంధుల కళ్లు తెరుచుకోవట్లేదు. తల్లి వయసున్న మహిళల నుంచి కూతురు వయసున్న చిన్నారుల వరకు.. దుర్మార్గుల వికృత చేష్టలకు బలవుతున్నారు. ఈ క్రమంలోనే విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ట్యూషన్ టీచర్ ఆరేళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ అమానుష ఘటన సికింద్రాబాద్ నియోజకవర్గంలోని జవహర్​నగర్ పీఎస్ పరిధిలోని బీజెేఆర్ నగర్​లో చోటు చేసుకుంది.

అసలేం జరిగిందంటే...

బీజేఆర్ నగర్​లో నివాసం ఉంటున్న సందీప్ అనే ట్యూషన్ టీచర్ దగ్గరకి ఆరేళ్ల బాలిక చదువుకోవడానికి వస్తుంది. ఈ క్రమంలో ఓ రోజు సందీప్ తనతో అసభ్యంగా ప్రవర్తించి అత్యాచారయత్నానికి పాల్పడినట్లు బాలిక ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు, స్థానికులు అతనిని చితకబాదారు. చిన్నారిపై అత్యాచారానికి పాల్పడేందుకు యత్నించిన అతనిని ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చి దేహశుద్ధి చేశారు.

ట్యూషన్ కోసం చిన్నారులను పంపితే ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడడం దారుణమని సందీప్​పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న జవహర్ నగర్ పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి:Rape attempt on beggar: భిక్షాటన చేసే పాపపై పెయింటర్​ అత్యాచారయత్నం..

Last Updated : Feb 12, 2022, 2:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.