ETV Bharat / crime

లిఫ్ట్ అడిగి.. పోలీసునని బెదిరించి బైక్ ఎత్తుకెళ్లిన వ్యక్తి అరెస్ట్

author img

By

Published : Apr 3, 2021, 2:25 PM IST

లిఫ్ట్ అడిగి బైక్ ఎత్తుకెళ్లిన వ్యక్తిని గోపాలపురం ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిలకలగూడ చౌరస్తా దగ్గర నిర్వహించిన తనిఖీల్లో నిందితుడు అనుమానాస్పదంగా కనిపించగా.. ఆరా తీస్తే అసలు విషయం తెలిసిందని పోలీసులు తెలిపారు. గోపాలపురం పోలీస్ స్టేషన్‌కు తరలించామని వెల్లడించారు.

Hyderabad traffic police, bike theft accused arrest
బైక్ ఎత్తుకెళ్లిన వ్యక్తి అరెస్ట్, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు

లిఫ్ట్ అడిగి... పోలీసునని బెదిరించి ద్విచక్ర వాహనాన్ని ఎత్తుకెళ్లిన వ్యక్తిని గోపాలపురం ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. సీతాఫల్‌మండిలో నివాసముండే విద్యార్థి అరవింద్ మార్చి నెలాఖరున తన బైక్​పై సికింద్రాబాద్ వైపు వెళ్తుండగా మార్గమధ్యలో జనగామకు చెందిన బాలరాజు లిఫ్ట్ అడిగాడని పోలీసులు తెలిపారు. చిలకలగూడ రైల్వే క్వార్టర్స్ వద్దకు రాగానే పోలీసునని బెదిరించి వాహనాన్ని బలవంతంగా తీసుకెళ్లాడని పేర్కొన్నారు.

బాలరాజు ద్విచక్రవాహనంపై శుక్రవారం ఉదయం చిలకలగూడ చౌరస్తా మీదుగా వెళ్తుండగా వాహనాలు తనిఖీ చేస్తున్న గోపాలపురం ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని నిలిపి పత్రాలను అడిగినట్లు వెల్లడించారు. ఆ వ్యక్తి అనుమానాస్పదంగా సమాధానం చెప్పడంతో అదుపులోకి తీసుకొని గోపాలపురం పోలీస్ స్టేషన్‌కు తరలించామని వివరించారు.

ఇదీ చదవండి: డీఎంకే ఎంపీ కనిమొళికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.