ETV Bharat / crime

Road Accident: ఘోరరోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం - చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం

ఏపీలోని చిత్తూరు జిల్లాలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారు.

Road accident in Chittoor
Road accident in Chittoor
author img

By

Published : Jan 15, 2022, 2:58 PM IST

ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లె ఐదో మైలు వద్ద శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను తిరుపతిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం ముగ్గురూ మృతిచెందారు. మృతులు ఇస్మాయిల్, సిద్ధిక్, శ్రీనివాసులుగా పోలీసులు గుర్తించారు. ఇస్మాయిల్, సిద్దిక్ వాల్మీకీపురం మండలం చింతపర్తివాసులు కాగా.. శ్రీనివాసులు స్వగ్రామం మదనపల్లె మండలం కొత్తవారిపల్లి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఇదీచూడండి: రైలు పట్టాలపై కాంక్రీట్ స్తంభం- కుట్రపూరితంగానే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.