ETV Bharat / crime

15రోజుల్లో ఆ కుటుంబంలో ముగ్గురిని పొట్టన పెట్టుకున్న కొవిడ్​ - తెలంగాణలో కరోనా మృతులు

కొవిడ్​ మహమ్మారితో 15 రోజుల వ్యవధిలో ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు విడిచారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తడ్కోలులో జరిగింది.

three died
covid
author img

By

Published : May 2, 2021, 4:55 PM IST

కరోనా మహమ్మారి ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. 15రోజుల వ్యవధిలో ముగ్గురిని పొట్టనపెట్టుకుంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తడ్కాలు గ్రామానికి చెందిన శ్రీనివాస్​ 15 రోజుల క్రితం కొవిడ్​తో మృతి చెందాడు. కొన్ని రోజుల తర్వాత అతని తల్లి కరోనాతోనే ప్రాణాలు విడిచింది.

పెళ్లై ఏడాది తిరక్కుండానే..

అప్పటికీ ఆ ఇంట మరణాలు ఆగలేదు. హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కొవిడ్​​తో చికిత్స పొందుతున్న శ్రీనివాస్​ పెద్దకుమారుడు అరవింద్​.. ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచాడు. హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్​వేర్​ ఉద్యోగం చేస్తున్న అరవింద్​కు​... ఏడాది క్రితమే పెళ్లయింది. 15రోజుల్లో ముగ్గురి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చూడండి: కదులుతున్న బస్సు కిందపడి కొవిడ్​ బాధితుడు బలవన్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.