ఓ మహిళ మెడలో నుంచి మంగళ సూత్రాన్ని గుర్తు తెలియని దుండగుడు లాక్కెళ్లిన ఘటన... హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో చోటు చేసుకుంది. అనూష అనే మహిళ విధులు ముగించుకుని ఇంటికి నడుచుకుంటూ వెళుతుంది. సత్యసాయి నిగమాగమం వద్ద వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఓ దుండగుడు... ఆమె మెడలోని మూడున్నర తులాల బంగారు ఆభరణాన్ని లాక్కుని పరారయ్యాడు.
దుండగుడు ఒక్కసారిగా మంగళ సూత్రాన్ని లాగడంతో బాధిత మహిళ కిందపడి తీవ్రంగా గాయపడింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఆ సమీపంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. బాధితురాలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి సీసీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: అసెంబ్లీ ముట్టడికి యువజన కాంగ్రెస్ యత్నం