ETV Bharat / crime

కోళ్ల దొంగతనానికి వచ్చాడని.. కొట్టి చంపారు..!! - కోళ్లను దొంగతనానికే వచ్చాడంటూ కొట్టి చంపారు

Person was beaten to death: ఎంత ఘోరం అసలు కోళ్ల దొంగతనానికి వచ్చాడని చెప్పి కొట్టి చంపారు. ఇది మీరు నమ్మలేక పోతున్నారా! నిజమండీ బాబూ ఈ దారుణం ఎక్కడో బీహార్​లో అనుకుంటే పొరపాటే మన పక్కనే ఉన్న ఆంధ్రలో జరిగింది. అసలేం జరిగిందో చూద్దామా..

Person was beaten to death
వ్యక్తిని కొట్టి చంపారు
author img

By

Published : Sep 18, 2022, 10:57 AM IST

Person was beaten to death: మామిడితోటలోని కోళ్లదొడ్డిలో కోళ్ల చోరీకి వచ్చాడన్న నెపంతో.. అవినాష్ అనే వ్యక్తిని కోళ్ల దొడ్డి యజమాని కొట్టి చంపాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా నూజివీడు ఎం.ఆర్.అప్పారావు కాలనీలో జరిగింది. అవినాష్‌ను చెట్టుకు కట్టేసి కర్రలతో కొట్టడంతో.. అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. స్థానికులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. నూజివీడు ఆస్పత్రికి తరలించేలోపే అవినాష్ మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ దారుణమైన ఘటనపై స్థానికులు పెదవి విరుస్తున్నారు. కోళ్ల దొంగతనానికి వస్తే దొంగగా అనుమానించి చచ్చేలా కొడతారా..? అంటూ వాపోయారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.