ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం లైదాం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మురళీకృష్ణ.. గ్రామస్థుల చేతిలో దెబ్బలు తిన్నారు. తమతో అసభ్యకరంగా మాట్లాడుతున్నాడంటూ.. ఆడపిల్లలు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఉదయం పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయుడిని చితకబాదారు. పలుమార్లు హెచ్చరించినా... ఆయన ప్రవర్తనలో మార్పు లేదని అందుకే బుద్ధి చెప్పామని... గ్రామస్థులు తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారులు, కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: మంత్రి కేటీఆర్ పీఏ పేరుతో మోసాలు.. లక్షల్లో వసూళ్లు