సూర్యాపే జిల్లాలోని పాలకీడు మండలంలో ఉన్న దర్గా మొక్కలు తీర్చుకోవడం కోసం.. గుంటూరుకు చెందిన ఓ కుటుంబం ట్రాక్టర్లో బయలుదేరారు. కాగా వీరు ప్రయాణిస్తున్న ఓ ట్రాక్టర్ మార్గమధ్యలో దామరచర్ల మండలం ఓ బ్రిడ్జి వద్ద అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ఘటనలో 20 మందికి గాయాలుకాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయాలైన బాధితులను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలైన వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.
- ఇదీ చూడండి : పేకాట వ్యసనం.. 50 లక్షలు స్వాహా