చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో.. కన్న కొడుకే కాల యముడయ్యాడు. అర్ధరాత్రి.. నిద్రలో ఉన్న తండ్రిని దారుణంగా హతమార్చాడు. సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ మండలంలో జరిగిన ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
తండ్రే చేతబడి చేశాడని..
అమీరాబాద్‌కు చెందిన గడ్డమీది బీరుగొండ(65)కు ఆరుగురు కుమారులు సంతానం. నాలుగో కుమారుడు తుకారాం.. బీఎస్సీ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ జీవించేవాడు. తరుచూ అనారోగ్యం బారిన పడుతున్నందుకు.. తండ్రి చేతబడి చేయడమే కారణమని భావించాడు. గ్రామానికి వచ్చి తండ్రితో గొడవ పడుతూ ఉండేవాడు. తుకారాం మానసిక పరిస్థితిని గుర్తించిన కుటుంబీకులు.. అతడిని ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో చేర్పించి చికిత్స అందించారు. ఇటీవలే కోలుకున్న తుకారం.. తిరిగి గ్రామానికి వచ్చాడు.
కంటిలో పొడిచి..
మంగళవారం అర్ధరాత్రి.. నిద్రిస్తోన్న తండ్రిపై తుకారం దాడికి పాల్పడ్డాడు. కంటిలో పొడిచి.. దారుణంగా హత్య చేశాడు. తన తండ్రిని.. తానే హత్య చేసినట్లు పోలీసులు ఎదుట లొంగిపోయాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన జహీరాబాద్ డీఎస్పీ శంకర రాజు, గ్రామీణ సీఐ నాగేశ్వరరావులు.. నిందితుడు తుకారాన్ని అదుపులోకి తీసుకున్నారు. మృతుడి మరో కుమారుడి ఫిర్యాదుతో.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: రెండు లారీలు ఢీ.. డ్రైవర్‌లు మృతి