ETV Bharat / crime

దమ్మాయిగూడ చిన్నారి మృతి కేసులో వీడిన మిస్టరీ - ఇందు మృతి కేసులో వీడిన మిస్టరీ

Indu Death Mystery Solved
Indu Death Mystery Solved
author img

By

Published : Dec 19, 2022, 10:36 AM IST

Updated : Dec 19, 2022, 11:24 AM IST

08:26 December 19

Indu Death Mystery Solved : దమ్మాయిగూడ చిన్నారి మృతి కేసులో వీడిన మిస్టరీ

Indu Death Mystery Solved : హైదరాబాద్‌ దమ్మాయిగూడలో చిన్నారి ఇందు మృతి కేసులో మిస్టరీ వీడింది. ఇందు మరణం ప్రమాదవ శాత్తు జరిగిందని.. హత్య కాదని పోలీసులు తేల్చారు. బాలిక ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయినట్లు వెల్లడించారు. మూత్ర విసర్జన కోసం చిన్నారి.. చెరువు దగ్గరకి వెళ్లిందని చెప్పారు. ఆడుకునేందుకు వచ్చిన చిన్నారికి.. ఎక్కడా సరైన ప్రదేశం లేకపోవడంతో మూత్ర విసర్జన కోసం చెరువు వద్దకి వెళ్లిందని వివరించారు. ఆ సమయంలో కాలు జారి పడిపోయినట్లు తెలిపారు. ఇందు ఊపిరితిత్తుల్లోకి చెరువు నీరు వెళ్లిందన్న పోలీసులు.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో వైద్యులు ఆ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారని చెప్పారు.

ఈ కేసు నేపథ్యమిదీ.. ఈనెల 15న పాఠశాలకెళ్లి అదృశ్యమైన బాలిక అనుమానాస్పదస్థితిలో చెరువులో మృతదేహంగా కనిపించడం కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్‌నగర్‌ పరిధి ఎన్టీఆర్‌నగర్‌కాలనీలో పాత సామగ్రి సేకరిస్తూ ఉపాధి పొందే జీడల నరేష్‌(35) దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. ముగ్గురు దమ్మాయిగూడలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. గురువారం ఉదయం చిన్న కుమార్తె ఇందు(10), కుమారుడి(12)ని తీసుకొని తండ్రి నరేష్‌ తన ద్విచక్రవాహనంపై పాఠశాలకు బయలుదేరాడు. పని ఉందంటూ పిల్లలిద్దరిని మధ్యలో దింపి నడిచి వెళ్లమని చెప్పారు. వారు నడుచుకుంటూ బడికెళ్లారు. కొద్దిసేపటి తర్వాత పుస్తకం మరిచిపోయాను తెచ్చుకుంటానని ఇందు ఒంటరిగా పాఠశాల నుంచి బయటికెళ్లింది. హాజరు తీసుకుంటున్న ఉపాధ్యాయుడు విద్యార్థిని రాలేదని గుర్తించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. తల్లిదండ్రులు 100కు సమాచారం ఇచ్చారు.

గురువారం సాయంత్రం వరకూ ఎదురుచూసినా బాలిక ఆచూకీ తెలియలేదు. పోలీసులు రాత్రి 7.30 గంటల సమయంలో డాగ్‌స్క్వాడ్‌తో గాలింపు చేపట్టగా.. పాఠశాల నుంచి దమ్మాయిగూడ చెరువు వరకూ వెళ్లాయి. సీసీఫుటేజీలు పరిశీలించగా.. బాలిక గురువారం ఉదయం 9.23గంటల సమయంలో పాఠశాల సమీపం నుంచి ఒంటరిగా వెళ్తున్నట్లు ఉంది. మరిన్ని ఫుటేజీల్లో.. దమ్మాయిగూడ చెరువు మార్గంలో బాలిక పరిగెత్తుకుంటూ వెళ్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు విచారణను కొనసాగించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన గాంధీ ఆస్పత్రి వైద్యులు.. ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతోనే బాలిక ఇందు మృతిచెందినట్లు నివేదికలో పేర్కొన్నారని పోలీసులు వెల్లడించారు.

సంబంధిత కథనాలు :

Last Updated : Dec 19, 2022, 11:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.