చెట్టుపై నుంచి పడి ఓ గీత కార్మికుడు మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని రేగొండ మండలం రంగయ్యపల్లి గ్రామానికి చెందిన దేశిని సతీష్ గౌడ్ ( 50 ) తాటి చెట్టుపై నుంచి కింద పడ్డాడు.
సాయంత్రం కల్లు గీసేందుకు చెట్టు ఎక్కి కాలు జారడటంతో కింద పడ్డట్లు స్థానికులు తెలిపారు. గాయాలపాలైన సతీష్ గౌడ్‌ను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి వైద్యం చేస్తుండగా మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి: