విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. ఈ ఘటన నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలంలో చోటు చేసుకుంది. ఎల్లాపురం గ్రామంలో.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. కాంట్రాక్టు లైన్మెన్ రామా చారి(35) .. సబ్ స్టేషన్ నుంచి అనుమతులు తీసుకుని… రిపేర్ చేయడం కోసం కరెంట్ పోల్ ఎక్కాడు. పని జరుగుతుండగానే పవర్ సప్లై అవడంతో షాక్‌కు గురై.. అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడి కుటుంబ సభ్యులు.. విద్యుత్ కార్యాలయం ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. మృతుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. పోస్టుమార్టం నిమిత్తం.. మృత దేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: ధాన్యం లారీని ఢీకొన్న బైక్.. ఒకరు మృతి