ETV Bharat / crime

YS Viveka murder case: సీబీఐ అదుపులో అనుమానితుడు శివశంకర్‌రెడ్డి

వైఎస్​ వివేకా హత్యకేసులో(YS Viveka murder case) అనుమానితుడు శివశంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్​లోని ఓ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతుండగా... అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హైదరాబాద్ కార్యాలయానికి తీసుకెళ్లారు.

YS Viveka murder case, cbi
సీబీఐ అదుపులో అనుమానితుడు శివశంకర్‌రెడ్డి, వివేకా మర్డర్ కేసు
author img

By

Published : Nov 17, 2021, 5:11 PM IST

వైఎస్ వివేకా హత్యకేసు(YS Viveka murder case)లో అనుమానితుడు శివశంకర్ రెడ్డిని(Shiva Shankar Reddy) సీబీఐ అధికారులు(CBI officers) అదుపులోకి తీసుకున్నారు. శివశంకర్ రెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. సీబీఐ అధికారులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం శివశంకర్‌రెడ్డిని హైదరాబాద్‌ సీబీఐ కార్యాలయానికి(CBI office in Hyderabad) తరలించారు.

కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి(Kadapa MP Avinash Reddy) ఏపీ వైకాపా కార్యదర్శిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్​రెడ్డి ముఖ్య అనుచరుడు. దస్తగిరి(Dastagiri) వాంగ్మూలం మేరకు శివశంకర్‌రెడ్డి పేరు ప్రముఖంగా ప్రస్తావనలోకి వచ్చింది. వివేకా కుమార్తె సునీత ఏపీ హైకోర్టుకు ఇచ్చిన అనుమానితుల్లో శివశంకర్‌రెడ్డి పేరు ఉంది. ఇప్పటికే కడప(Kadapa), పులివెందుల(Pulivendula)లో శివశంకర్‌రెడ్డిని సీబీఐ అధికారులు పలుమార్లు విచారించారు.

సీబీఐ అప్రూవర్ పిటిషన్​పై కౌంటర్ దాఖలు...

కడప సబ్ కోర్టులో సీబీఐ అప్రూవర్ పిటిషన్‌పై ఎర్రగంగిరెడ్డి, ఉమాశంకర్‌, సునీల్‌ తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. దస్తగిరి అప్రూవర్ పిటిషన్‌పై నిందితుల తరఫు లాయర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపిన కడప ఉపన్యాయస్థానం తదుపరి విచారణను 22కు వాయిదా వేసింది.

వాంగ్మూలంలోని విషయాలు...

‘వైఎస్‌ వివేకానందరెడ్డిని చంపేయ్‌. నువ్వు ఒక్కడివే కాదు మేమూ నీతో పాటు వస్తాం. దీని వెనుక వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ మనోహర్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, డి.శంకర్‌రెడ్డి వంటి పెద్దవాళ్లు ఉన్నారు. ఈ హత్య చేస్తే శంకర్‌రెడ్డి రూ.40 కోట్లు ఇస్తారు. అందులో రూ.5 కోట్లు నీకు ఇస్తాను’ అంటూ వివేకాకు సన్నిహితుడైన ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పారని నిందితుల్లో ఒకరు, అప్రూవర్‌గా మారిన షేక్‌ దస్తగిరి వెల్లడించారు. ఆ సమయంలో యాదటి సునీల్‌ యాదవ్‌, గజ్జల ఉమాశంకర్‌రెడ్డిలు కూడా ఉన్నారని తెలిపారు. అలా 2019 ఫిబ్రవరి 10న గంగిరెడ్డి ఇంట్లోనే ఈ హత్య కుట్ర రూపొందిందని చెప్పారు. ‘డ్రైవర్‌గా ఏం సంపాదిస్తావ్‌? ఈ హత్య చెయ్యి. నీ జీవితం సెటిలైపోద్ది’ అంటూ గంగిరెడ్డి తనతో చెప్పాడన్నారు. ఆ ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత సునీల్‌ తనకు రూ.కోటి అడ్వాన్సు ఇచ్చాడని చెప్పారు. ఈ మేరకు కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి న్యాయస్థానంలో సీఆర్‌పీసీ 164(1) ప్రకారం దస్తగిరి ఆగస్టు 31న, సీబీఐకి ఆగస్టు 25న ఇచ్చిన వాంగ్మూలాలు శనివారం వచ్చాయి.

ఎవరు ఏంటి?

  • ఎర్ర గంగిరెడ్డి: 40 ఏళ్లుగా వివేకాకు సన్నిహితుడు. ఆయనతో పాటే ఉండేవారు.
  • గజ్జల ఉమాశంకర్‌రెడ్డి: వివేకా వద్ద పీఏగా పనిచేసిన జగదీశ్వరరెడ్డికి సోదరుడు. పాలడెయిరీ నిర్వహిస్తుంటారు.
  • యాదటి సునీల్‌ యాదవ్‌: పులివెందుల మండలం మెట్నంతలపల్లె. జగదీశ్వరరెడ్డి ద్వారా వివేకాకు పరిచయమయ్యారు.
  • దస్తగిరి: వివేకా వద్ద 2017, 2018 సంవత్సరాల్లో డ్రైవర్‌గా పనిచేశారు.
  • డి. శివ శంకర్‌రెడ్డి: వైకాపా రాష్ట్ర కార్యదర్శి, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి అనుచరుడు
  • వైఎస్‌ అవినాష్‌రెడ్డి: కడప ఎంపీ
  • వైఎస్‌ మనోహర్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి: వైఎస్‌ కుటుంబీకులు

ఇదీ చదవండి: Viveka Murder Case: 'వైఎస్‌ వివేకానందరెడ్డిని చంపేయ్‌.. మేమూ నీతో పాటు వస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.