ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో తనిఖీల్లో సెల్ఫోన్ల దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. తాడూరు ఎస్సై వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి సమ్మక్క సారలమ్మ దేవాలయ ప్రాంగణంలో పెట్రోలింగ్ చేస్తుండగా.. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరించడంతో అతడిని తనిఖీ చేశారు. అతని వద్ద 2 సెల్ఫోన్లు లభ్యమయ్యాయి. నిందితుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తంబల్ల సతీష్ అలియాస్ రాజుగా పోలీసులు గుర్తించారు. అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
మరో కేసులో మండల కేంద్రంలో తనిఖీలు చేస్తుండగా ఓ వాహనంలో ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని తనిఖీ చేశారు. వారి వద్ద 11 చరవాణీలు లభించాయి. ఏపీలోని అనంతపురం, కర్నూలు, కడప, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన ఐదుగురు కలిసి ఒక ముఠాగా ఏర్పడి చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. జాతరలో భక్తుల్లాగా దర్శనానికి వచ్చి ప్రజల జేబుల్లోంచి సెల్ఫోన్లను దొంగిలించారని వెల్లడించారు. మొత్తం సెల్ఫోన్ల విలువ రూ. లక్షకు పైగా ఉంటుందని పేర్కొన్నారు. వారు ఉపయోగించిన వాహనాన్ని సీజ్ చేశారు.
ఇదీ చదవండి: కేటీఆర్ పీఏనంటూ మోసాలు.. నిందితుడి అరెస్ట్