మేడ్చల్ జిల్లా షాపూర్ నగర్లో.. కిరాణా దుకాణం పేరిట గుట్టుచప్పుడు కాకుండా గుట్కా వ్యాపారం(Gutka Business) నిర్వహిస్తోన్న ఓ యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి.. అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 40 వేల విలువగల గుట్కా ప్యాకెట్లు, సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు భరత్ కుమార్(22).. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో అక్రమాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అక్రమ వ్యాపారాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చదవండి: Counterfeit seeds: 'నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తాం'