ETV Bharat / crime

'మా నాన్న నరకం చూపిస్తున్నాడు.. ఆయణ్ని చంపాలనుంది' - student suicide at nandigama

‘‘మా నాన్న మూర్ఖుడు.. తాగొచ్చి రోజూ నరకం చూపిస్తున్నాడు. అమ్మ బతికి ఉన్నప్పుడు మంచిగా ఉండేవాడు.. ఆపై మద్యానికి బానిసై మృగంగా మారాడు. నాన్నా.. అని పిలవడానికీ మనసు రావడంలేదు. ఆయనను చంపాలని లేదా చనిపోవాలని ఉంది. మూడుసార్లు ఉరివేసుకున్నా ఎవరో ఒకరు కాపాడారు. ఆయన రోజూ వేధిస్తున్నాడు. ఇంకొన్ని రోజుల్లో నా చావు వార్త అందరికీ తెలుస్తుంది. వెయిటింగ్‌ ఫర్‌ మై డెత్‌’’. అంటూ గతంలోనే ఉత్తరం రాసుకున్న ఓ విద్యార్థిని ఈనెల 22న ఉరివేసుకుని చనిపోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

Student Suicide at Nandigama
Student Suicide at Nandigama
author img

By

Published : May 24, 2022, 7:14 AM IST

Student Suicide at Nandigama : పదో తరగతి పరీక్షలకు ముందురోజు ఓ విద్యార్థిని ఉరి వేసుకుని మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం బుగ్గోనిగూడలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఇన్‌స్పెక్టర్‌ రామయ్య, బాలిక సోదరుడు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నర్సింహులు, లలిత దంపతులకు కుమారుడు, పదోతరగతి చదువుతున్న కుమార్తె మనీషా(16) ఉన్నారు. లలిత ఏడాది క్రితం చనిపోయింది. భార్య చనిపోయినప్పటి నుంచి నర్సింహులు తాగుడుకు బానిసయ్యాడు.

ఆ మైకంలో కుమారుడు, కుమార్తెతో నిత్యం గొడవపడేవాడు. ఆదివారం ఉదయమూ అదే జరిగింది. మధ్యాహ్నం తండ్రి కుమారుడికి ఫోన్‌చేసి చెల్లెలు ఇంట్లో దూలానికి ఉరివేసుకుందని చెప్పాడు. ఆయన ఇంటికి వచ్చి చూడగా మెడ భాగంలో కమిలిన గాయాలతో మనీషా చనిపోయి ఉంది. పక్కనే మంచంపై ఉన్న పుస్తకంలో ‘ఐ హేట్‌ మై డ్యాడ్‌’ అని నాలుగుసార్లు రాసి ఉంది. ‘మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం’.. అంటూ గతంలో రాసిన లేఖ కూడా దొరికింది. ఈ మేరకు సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.