ETV Bharat / crime

Students missing: బద్వేలులో విద్యార్థుల అదృశ్యం.. హైదరాబాద్​లో ప్రత్యక్ష్యం.. అసలేం జరిగింది? - kadapa latest crime news

ఏపీలోని కడప జిల్లాలో ముగ్గురు పదోతరగతి విద్యార్థులు అదృశ్యమయ్యారు. నిన్న పాఠశాలకు వెళ్లిన పిల్లలు.. తిరిగి ఇంటికి రాలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు.. వారు హైదరాబాద్​లో ఉన్నట్లు గుర్తించారు. విద్యార్థులు హైదరాబాద్​కు ఎందుకు వెళ్లారనే దానిపై కారణాలు తెలియాల్సి ఉంది.

Students missing in badvel
బద్వేలులో విద్యార్థులు అదృశ్యం
author img

By

Published : Nov 6, 2021, 12:37 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని కడప జిల్లా బద్వేలులో ముగ్గురు విద్యార్థులు అదృశ్యమవడం కలకలం రేపింది. నిన్న పాఠశాలకు వెళ్లిన పదో తరగతి విద్యార్థి రహమాన్‌, ఏడో తరగతి విద్యార్థులు నబి, రహీం తిరిగి ఇంటికి రాలేదు. రాత్రి వరకు వీరి కోసం కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విద్యార్థుల ఆచూకీ కోసం గాలింపు మొదలుపెట్టారు.

వీరు ఇంట్లో పాఠశాలకు వెళ్తున్నామని చెప్పి బద్వేలుకు సమీపంలోని అబుసాహెబ్‌ పేట వద్ద సైకిళ్లు పెట్టి హైదరాబాద్‌కు వెళ్లినట్లు సమాచారం. విద్యార్థుల ఆచూకీ కనుగొన్న పోలీసులు వారిని అక్కడి నుంచి బద్వేలు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: పేకాట కేసులో ఐదుగురు అరెస్టు.. రూ.12.66 లక్షలు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.