ETV Bharat / crime

వివాహితపై లైంగిక దాడి కేసులో పదేళ్ల జైలు - Ten years in prison

Ten years in prison for sexual assault on a married woman
వివాహితపై లైంగిక దాడి కేసులో పదేళ్ల జైలు
author img

By

Published : Jan 22, 2022, 9:56 AM IST

09:47 January 22

లైంగిక దాడి కేసులో పదేళ్ల జైలు

వివాహితపై లైంగిక దాడి కేసులో భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలం కృష్ణసాగర్‌కు చెందిన ఆటో డ్రైవర్‌ ఆంతోటి వినయ్‌కి పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.6 వేల జరిమానా విధిస్తూ ఖమ్మం మహిళా కోర్టు, ఎనిమిదో అదనపు సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి ఎం.శ్యాంశ్రీ శుక్రవారం తీర్పు చెప్పారు.

ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం.. 2017 డిసెంబరు 27న బాధితురాలు పొయ్యిలో కట్టెల కోసం అడవికి వెళ్లగా అక్కడ నిందితుడు కత్తితో బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పాల్వంచ పోలీసులు సమగ్ర దర్యాప్తు అనంతరం కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. సాక్ష్యాధారాలు, వైద్య నివేదికలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడిపై మోపిన నేరం రుజువు కావడంతో పైవిధంగా తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ తరఫున ఏపీపీ జి.హరేందర్‌రెడ్డి వాదించగా లైజన్‌ అధికారి ముత్తయ్య, సీడీవో సురేశ్‌, వెంకటరమణ సహకరించారు.

ఇవీ చదవండి :

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.