ETV Bharat / crime

Cars theft gang: ఇక్కడ కార్ల దొంగతనం.. పక్క రాష్ట్రాల్లో విక్రయం.. ఇద్దరు అరెస్ట్​ - maruti cars theives

Cars theft gang: రాచకొండ కమిషనరేట్​ పరిధిలో కార్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 8 కార్లను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారు.

cars theft news
కారు దొంగల అరెస్టు
author img

By

Published : Dec 11, 2021, 6:43 PM IST

Cars theft gang: మారుతీకార్లను అపహరిస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను రాచకొండ పోలీసులు గుర్తించారు. ఆ గ్యాంగ్​లోని ఇద్దరు వ్యక్తులను మల్కాజిగిరి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 50 లక్షల విలువ చేసే 8 కార్లను స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ అడిషనల్‌ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు తెలిపారు. ఈ కేసులో మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు.

రాచకొండ పోలీసు కమిషనరేట్​కు చెందిన పలు పోలీసు స్టేషన్ల పరిధుల్లో ఈ అంతర్రాష్ట్ర ముఠా.. కార్లను దొంగిలించి ఇతర రాష్ట్రాల్లో విక్రయిస్తోందని అదనపు సీపీ తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలిపిన అదనపు సీపీ.. మిగిలిన నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Theft in Gold Shop: బంగారు షాపులో చోరీ.. ఇంటి దొంగల పనేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.