ETV Bharat / crime

Telugu Akademi Accused: మరో భారీ స్కాంకు తెలుగు అకాడమీ కేసు నిందితుని ప్లాన్​​..! - Telugu Akademi scam updates

Telugu Akademi Accused: తెలుగు అకాడమీ కేసులో నిందితుడు మరో భారీ స్కాం​కు ప్లాన్ చేశాడు. తెలుగు అకాడమీ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి షేక్ మస్తాన్​వలి సాహెబ్... మరో భారీ స్కాం​కు ప్రయత్నించినట్టు గుర్తించారు. తెలంగాణ గిడ్డంగుల శాఖకి చెందిన 3 కోట్ల 98 లక్షల రూపాయలను కార్వాన్ యూనియన్ బ్యాంక్ నుంచి కాజేసేందుకు ప్లాన్​ వేసినట్టు తాజాగా ఫిర్యాదు అందింది.

Telugu Akademi Accused planned to another huge scam in Warehouses department

author img

By

Published : Jan 20, 2022, 6:54 PM IST

Telugu Akademi Accused: తెలుగు అకాడమీ కేసులో ఏ-1 నిందితుడైన షేక్ మస్తాన్‌ మరో కుంభకోణానికి కుట్రపన్నినట్టు అధికారులు గుర్తించారు. రాష్ట్ర గిడ్డంగుల శాఖకు చెందిన 3 కోట్ల 98 లక్షల రూపాయలను కార్వాన్ యూనియన్ బ్యాంక్ నుంచి కాజేసేందుకు ప్రయత్నించాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. తెలుగు అకాడమీ ఎఫ్డీలతో పాటు గిడ్డంగుల శాఖ ఎఫ్టీలను కాజేసేందుకు ఒకేసారి ప్లాన్ చేసుకున్న మస్తాన్... తెలుగు అకాడమీ స్కామ్ బయటపడటంతో ఈ ప్లాన్ ఫెయిలైందని గుర్తించారు. మస్తాన్​వలిపై సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రస్తుత యూనియన్ బ్యాంక్ కార్వాన్ బ్రాంచి మేనేజర్ గిరీష్ కుమార్... గిడ్డంగుల శాఖ ఫిక్స్ డిపాజిట్లకు చెందిన ఫోర్జరీ పత్రాలను సృష్టించారని ఫిర్యాదు చేశారు.

ఇప్పటికే తెలుగు అకాడమీ కుంభకోణంలోని రెండు కేసుల్లో నిందితుడుగా ఉన్న మస్తాన్​వలీ.. ఈ కేసుల్లో చంచల్​గూడ జైల్లో ఉన్నాడు. తాజాగా గిడ్డంగుల శాఖ కేసులో మస్తాన్​వలిని పీటీ వారెంట్​పై అదుపులోకి తీసుకొని సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు. గతేడాది జనవరిలో మూడు కోట్ల 98లక్షలు ఎఫ్డీ చేశామని... రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఎండీ జితేందర్ రెడ్డి తెలిపారు. తెలుగు అకాడమీ కుంభకోణం అనంతరం... అన్ని బ్యాంకుల్లో ఉన్న తమ ఎఫ్డీలను పరిశీలించామన్నారు. యూనియన్ బ్యాంక్​లో ఉన్న ఎఫ్డీ కాలం పూర్తి కావడంతో డబ్బులను తీసుకునే క్రమంలో... నకిలీ పత్రాలుగా గుర్తించటంతో తమ అధికారులు అప్రమత్తమయ్యారని తెలిపారు. తమ ఎఫ్డీ అకౌంట్ నగదు సురక్షితంగా ఉండడంతో... బ్యాంక్ అధికారుల సూచన మేరకు ఇండెమినిటీ బాండ్ సమర్పించి పూర్తి డబ్బులను సంస్థకు చెల్లించిందన్నారు. ఇందులో తమ సంస్థ అధికారుల తప్పు లేదని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.