తెలంగాణ అర్చక సంఘం అధ్యక్షుడు, మతైక సంఘం అధ్యక్షుడు కనకంపట్ల వెంకటేశ్వర శర్మ మృతి చెందారు. గత నెల 24న పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లిన సమయంలో గుజరాత్ సూరత్‌లో వెంకటేశ్వర శర్మ కారుకు ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందారు. ఆ ప్రమాదంలో ఇద్దరు దేవాదాయశాఖ ఉద్యోగులు ఇప్పటికే మృతి చెందారు.
వెంకటేశ్వర శర్మ హైదరాబాద్ ముషీరాబాద్‌లోని అమ్మవారి ఆలయంలో సుదీర్ఘకాలంగా పనిచేశారు. ఆయనకు రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షులు చిన్నంమోహన్, కీసర గుట్ట దేవస్థాన అర్చకోద్యోగులు, ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు బేతి రంగారెడ్డి, కొత్తకొండ దేవస్థానం అర్చకులు మొగలి పాలెం రాంబాబు, వీరభద్రస్వామి సంతాపం తెలిపారు.
ఇదీ చదవండి : సూరత్‌లో తెలంగాణ అధికారుల మృతి..