ETV Bharat / crime

PD ACT: మాజీ రంజీ క్రికెటర్ నాగరాజుపై పీడీ యాక్ట్​ నమోదు - హైదరాబాద్ తాజా వార్తలు

మాజీ రంజీ క్రికెటర్ బి. నాగరాజుపై బంజారాహిల్స్​ పోలీసులు పీడీ యాక్ట్​ నమోదు చేశారు. మంత్రి కేటీఆర్ వ్యక్తిగత సహాయకుడు తిరుపతి రెడ్డి పేరుతో పలువురిని మోసం చేసిన కేసులో ఆతన్ని అరెస్టు చేసి చంచల్​గూడ జైలుకు తరలించారు.

pd act on former Ranji cricketer B Nagaraju.
మాజీ రంజీ ప్లేయర్ నాగరాజుపై పీడీ యాక్ట్​ నమోదు
author img

By

Published : Jun 25, 2021, 7:38 PM IST

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వ్యక్తిగత సహాయకుడు తిరుపతి రెడ్డి పేరుతో పలు మోసాలకు పాల్పడ్డ మాజీ రంజీ క్రికెటర్ బి.నాగరాజుపై పీడీ యాక్ట్ నమోదైంది. అతడిపై జూబ్లీహిల్స్​, బంజారాహిల్స్​, సీసీఎస్​ సహా ఏపీలోని విశాఖపట్నం, గుంటూరుల్లోని పలు పోలీస్ స్టేషన్లలో అనేక కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

నాగరాజు దాదాపు 33 లక్షల మేర అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఆతని ద్వారా మోసపోయిన వారిలో పలువురు వైద్యులు, పారిశ్రామిక వేత్తలు, ఫార్మా సంస్థల అధినేతలు ఉన్నారని పేర్కొన్నారు. గతంలో పలుమార్లు ఇదే తరహా మోసాలకు పాల్పడ్డ నిందితుడు పద్దతి మార్చుకోపోవడంతో పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు బంజారాహిల్స్​ పోలీసులు తెలిపారు. అతన్ని అరెస్టు చేసి చంచల్​గూడ జైలుకు తరలించినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: Nama nageshwara rao: ఇవాళ విచారణకు హాజరుకాని నామా.. మరోసారి నోటీసులు పంపనున్న ఈడీ...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.