ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అక్రమంగా నిల్వ ఉంచిన రెమ్డెసివిర్ ఇంజక్షన్లను టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ డాక్టర్స్ కాలనీలోని శ్రీ సూర్య జనరల్ ఆస్పత్రిలో గురువారం రాత్రి పోలీసులు సోదాలు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన 36 రెమ్డెసివిర్ ఇంజక్షన్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
ఆస్పత్రిలోని మందుల దుకాణంతో పాటు... ల్యాబరేటరీలోను ఇంజక్షన్లు దాటినట్లు గుర్తించారు. కొవిడ్ బాధితుల అవసరాలను ఆసరాగా చేసుకుని ఒక్కో ఇంజక్షన్ రూ.30 వేలకు పైగా విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వైద్యుడు అశోక్ కుమార్, సిబ్బందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామన్నారు. ఆస్పత్రిని సీజ్ చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: నకిలీ ధ్రువపత్రాలతో కారు లోన్.. హెల్త్ ఇన్స్పెక్టర్ అరెస్ట్