Suspicious death of a woman in Rajendra Nagar: హైదరబాద్‌లోని రాజేంద్రనగర్‌లో నవ వదువు అనుమానాస్పద మృతి అక్కడివారిని కలచి వేస్తోంది. పెళ్లి జరిగి ఐదు నెలలు అవుతున్న రేణమ్మ.. భర్త శ్రీనుతో కలిసి రాజేంద్రనగర్‌లో నివాసం ఉంటోంది. ఈరోజు ఇంట్లో ఫ్యాన్‌కు వేలాడుతూ రేణుమ్మ విగతజీవిగా కనిపించింది. అయితే మృతి పట్ల అనేక అనుమనాలు వ్యక్తం చేస్తున్నారు రేణమ్మ బంధువులు. రేణమ్మ మరణానికి భర్త శ్రీను కారణం మని వారు ఆరోపిస్తున్నారు. హత్యలో మరో ఇద్దరు ప్రమేయం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మృతిపై అనేక అనుమానాలు: పథకం ప్రకారమే నిన్న రేణమ్మను హత్య చేసి ఫ్యాన్‌కు ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని బంధువులు విచారం వ్యక్తం చేస్తున్నారు. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందంటూ రేణమ్మపై పలు మార్లు శ్రీను దాడి చేసేవాడని వారు విమర్శిస్తున్నారు. భర్త శ్రీనుపై క్రిమినల్ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీనును అదుపులోనికి తీసుకున్నారు. మృతదేహాన్ని శవ పంచనామ నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.