ETV Bharat / crime

suspicious death in nirmal: వివాహిత మృతి... భర్తపైనే అనుమానం - నిర్మల్‌లో వివాహిత అనుమానాస్పద మృతి

married women suspicious death in nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. భర్తే హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడని మృతురాలి తరఫు బంధువులు ఆరోపిస్తూ స్థానిక గ్రామీణ పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిపై రాస్తారోకో చేయడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

suspicious death
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
author img

By

Published : Mar 1, 2022, 5:05 PM IST

married women suspicious death in nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలోని విషాదం చోటుచేసుకుంది. మంజులపూర్‌ కాలనీకి చెందిన అరుగుల ప్రణీత (25) అనే వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందగా... భర్తే హత్య చేశాడని ఆరోపిస్తూ బంధువులు స్థానిక గ్రామీణ పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిపై రాస్తారోకో చేయడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భర్త సాయి కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకొని పీఎస్​కు తరలించారు.

suspicious death
వివాహిత ఫోటో

సాయి కృష్ణను తమకు అప్పగించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సరైన న్యాయం చేస్తామని పోలీసులు బంధువులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ప్రణీతకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతిచెందిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి.

అసలేం జరిగిందంటే...

'మా చెల్లిని 7 సంవత్సరాల క్రితం మంజులపూర్‌కు చెందిన సాయికృష్ణకు ఇచ్చి పెళ్లి చేశాం. గతంలోనూ మా చెల్లితో గొడవ పడేవారు. నిన్న రాత్రి గొడవపడ్డట్టు తెలిసింది. ఉదయం మా చెల్లి బాత్రూమ్‌లో పడిపోయిందని రమ్మని ఇతరులతో ఫోన్ చేయించారు. వచ్చి చూసేసరికి మృతి చెంది ఉంది. అడిగితే స్నానపు గదిలో ఉరివేసుకుందని చెబుతున్నారు. సాయి కృష్ణ , అతని కుటుంబీకులే మా చెల్లిని చంపారని మాకు అనుమానం ఉంది. మాకు సరైన న్యాయం చేయాలి.'

-ప్రవీణ్, మృతురాలి అన్న, ఓల గ్రామం

'నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఫోన్ ద్వారా వివాహిత మృతి చెందిందనట్లు సమాచారం అందడంతో విచారణ చేపట్టాం. మృతురాలి కుటుంబీకులు భర్తే చంపాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బాధితులకు సరైన న్యాయం జరిగేలా చూస్తాం.'

-వినయ్, నిర్మల్ రూరల్ ఎస్సై

ఇదీ చదవండి:Mother suicide with children: ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.