రెమ్‌డెసివర్ ఇంజక్షన్లను బ్లాక్‌లో అధిక ధరలకు విక్రయిస్తోన్న ఓ ముఠాను సూర్యాపేట పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. 11 మందిని అదుపులోకి తీసుకుని.. వారి నుంచి 30 టీకాలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
ముందస్తు సమాచారంతో.. టౌన్ సీఐ ఆంజనేయులు పర్యవేక్షణలో పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడ్డారు. జిల్లా కేంద్రంలోని రెండు ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా వ్యవహరించిన ఓ ఆసుపత్రి మేనేజర్‌ను, అతనితో ఉన్న మరో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కృత్రిమ కొరత సృష్టించి.. వారు రెమ్‌డెసివర్‌ను రూ. 30-35 వేల వరకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
పోలీసులు.. నిందితుల నుంచి ఇంజక్షన్లతో పాటు 11 సెల్ ఫోన్లు, ఓ బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు అనంతరం.. వారిని రిమాండ్‌కు తరలించారు. బ్లాక్ మార్కెట్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామమని సీఐ హెచ్చరించారు.
ఇదీ చదవండి: అరటి పండు తింటున్న వృద్ధురాలిపై తేనెటీగల దాడి