ETV Bharat / crime

పురుగుల మందుతో.. మందలపల్లి సర్పంచ్ ఆత్మహత్యాయత్నం - sarpanch suicide

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో ఓ మహిళా సర్పంచ్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో.. ఆమె ప్రాణాలతో బయటపడ్డారు.

sarpanch Suicide attempt
మహిళా సర్పంచ్‌ ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Mar 26, 2021, 8:05 PM IST

పురుగుల మందు తాగి.. ఓ మహిళా సర్పంచ్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో జరిగింది.

మందలపల్లి సర్పంచ్ దుర్గ.. గ్రామ పంచాయతీ నిధుల్లో అవకతవకలకు పాల్పడిందంటూ.. కొంత కాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా డీఎల్‌పీఓ హరి ప్రసాద్ విచారణ కోసం గ్రామానికి వచ్చారు.

విచారణ జరుగుతుండగానే.. తీవ్ర మనస్తాపానికి గురైన దుర్గ, ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాధితురాలిని.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

ఇదీ చదవండి: చికెన్ సెంటర్లో అగ్ని ప్రమాదం.. మంటల్లో కాలి బుడిదైన కోళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.