Diploma student suicide: ఇష్టం లేని కోర్సులో చదవి తీరా మంచి మార్కులు రాకపోవడంతో తల్లిదండ్రులు మందలించారని మనస్తాపానికి గురైన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లోని జీడిమెట్లలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం రాజీవ్‌గాంధీ నగర్లో నివాసం ఉంటున్న లాలుకుట, కరుణ దంపతుల కుమారుడు మురళి మొదట నుంచి ఇంజినీరింగ్ కోర్సు అంటే చాలా ఇష్టపడేవాడు. తల్లిదండ్రులు మాత్రం ఆ అబ్బాయిని బాలానగర్‌లో ఉన్న సీఐటీడీలో డిప్లొమా కోర్సులో జాయిన్ చేయించారు.
అప్పటి నుంచి చదువును చాలా కష్టంగా భావించిన మురళి.. మొదటి సంవత్సరంలోనే రెండు సబ్జెక్ట్‌లలో ఫెయిల్ అయ్యాడు. దీనిపై తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన ఆ విద్యార్థి జీడిమెట్ల బస్‌డిపో వద్ద ఉన్న రాజీవ్ స్వగృహ 14వ అంతస్థు పైకి ఎక్కి అక్కడ నుంచి కిందకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న జీడిమెట్ల పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహన్ని గాందీ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు.
శోకసంద్రంలో మునిగిపోయిన తల్లిదండ్రులు: మృతుడు జేబులో 'అమ్మనాన్న నన్ను క్షమించండి.. మీరు జాగ్రత్తగా ఉండండి' అనే లేఖ ఉంది. లేఖను చూసిన తల్లిదండ్రులు బోరున విలపించారు. వారి కన్నీటిని ఆపడం అక్కడున్న వారి ఎవరి వశం కాలేకపోయింది. చేతికి అందిన కొడుకు అర్థాంతరంగా తనవు చాలించడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఇవీ చదవండి: