Rape in mamidikuduru: ఏపీలోని కోనసీమ జిల్లా మామిడికుదురులో ఏడో తరగతి విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. బాలికపై ఆర్ఎంపీ వైద్యుడు వేగి రమేశ్ అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వైద్యం చేసేందుకు కొన్నిరోజుల కిందట ఇంటికి వచ్చిన ఆర్ఎంపీ వైద్యుడు.. తన కుమార్తె ఫోన్ నెంబర్ తీసుకున్నట్లు ఆమె తండ్రి పేర్కొన్నారు.
ఆమెతో పరిచయం పెంచుకున్న రమేశ్.. సోమవారం రాత్రి నాన్నమ్మతో కలిసి డాబాపై బాలిక నిద్రిస్తున్న సమయంలో అత్యాచారానికి ఒడిగట్టినట్లు చెప్పారు. ఆ సమయంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు నాన్నమ్మ కిందికి వెళ్లిందని.. ఇదే అదునుగా భావించిన నిందితుడు ఈ ఘాతుకానికి తెగబడినట్లు వివరించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు.. నగరం ఇన్‌ఛార్జి ఎస్సై కృష్ణమాచారి వెల్లడించారు.
ఇవీ చదవండి: