రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ జేబీఐటీ కళాశాలలో బీటెక్ రెండో ఏడాది చదువుతున్న విద్యార్థి(JBIT Student suicide) విజయ్ భాస్కర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిన్న రాత్రి కళాశాల వసతి గృహంలో విజయ్ ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు.
కళాశాల వసతి గృహంలో విజయ్ ఆత్మహత్య (student suicide) చేసుకోవడం కలకలం రేపింది. కుటుంబ సభ్యులు రాకముందే మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎలా పంపిస్తారని విద్యార్థులు కళాశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతిపై సరైన విచారణ చేపట్టాలని కోరారు. విజయ్ స్వస్థలం కరీంనగర్ జిల్లా నాగనూర్ మండలం ఎదురు గట్ల గ్రామం.
భోజనంలో పురుగులు
తమకు పురుగుల భోజనం పెడుతున్నారని పలుమార్లు కళాశాల యాజమాన్యానికి మొర పెట్టినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తమ సమస్యలు వినే వారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం తీరు సరిగా లేకపోవడంతోనే విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యార్థి చనిపోయినా(Student suicide in jbit) ఇంతవరకూ యాజమాన్యం రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు.
సమాచారం అందుకున్న పోలీసులు కళాశాల వద్దకు చేరుకున్నారు. విద్యార్థులు న్యాయం కోసం ధర్నా చేస్తుంటే.. యాజమాన్యంతో పోలీసులు చేతులు కలిపారని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. విద్యార్థులను భయాందోళనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
ఇదీ చదవండి: Heart stroke on bike: బైక్పై వెళ్తుండగా గుండె పోటు.. ఆస్పత్రికి వెళ్లే లోపే..