హైదరాబాద్ గచ్చిబౌలిలోని గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ ఐఐటీ క్యాంపస్‌లో ఈ నెల 25వ తేదీ రాత్రి ఇద్దరు విద్యార్థులు మద్య జరిగిన గొడవ హత్యాయత్నానికి దారితీసింది. సూర్యాపేట జిల్లా నారాయణగూడెం ప్రాంతానికి చెందిన సాత్విక్(17) గౌలిదొడ్డిలో ఇంటర్ బైపీసీలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన వంశీ (18) ఎంపీసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఆ రోజు సాయంత్రం అల్పాహారం తీనే సమయంలో సాత్విక్, వంశీల మధ్య గొడవ జరిగింది. ఉపాధ్యాయులు జోక్యం చేసుకుని వారిని సర్ది చెప్పి పంపించేశారు.
వంశీ అదే రోజు అర్ధరాత్రి ఒకటిన్నర సమయంలో సాత్విక్ గదిలోకి వెళ్లి బ్లేడ్‌తో గొంతు కోశాడు. రక్తస్రావం కావడంతో సాత్విక్ కేకలు వేయడంతో ఉపాధ్యాయులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సకాలంలో విద్యార్థికి చికిత్స అందడంతో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు వెల్లడించారు. మరుసటి రోజు మధ్యాహ్నం సాత్విక్ తల్లిదండ్రులు గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఇద్దరు విద్యార్థులు మైనర్లు కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: