హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ సభ్యులు నిరాహార దీక్ష చేపట్టారు. పీఆర్సీ నివేదిక వెల్లడించాలని డిమాండ్ చేస్తూ వారు నిరసనకు దిగారు. అయితే స్టీరింగ్ కమిటీ సభ్యులకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్‌లతో ఆ ప్రాంతంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రభుత్వం వెంటనే ఐక్యవేదిక భాగస్వామ్య సంఘాలతో చర్చలు ప్రారంభించాలని స్టీరింగ్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగులు హాజరయ్యారు.
ఇదీ చూడండి: 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత