ETV Bharat / crime

వీడిన బైక్‌ లిఫ్ట్‌ మర్డర్‌ మిస్టరీ... కారణం ఏంటో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే! - Man killed a biker in Khammam

Khammam bike lift incident : ఖమ్మంలో ఇంజక్షన్‌తో వ్యక్తిని చంపిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు భావించారు. హత్యలో ముగ్గురు ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. ఘటన జరిగిన 24 గంటల్లోనే పోలీసులు ఆధారాలు సేకరించారు. చింతకాని మండలం మున్నేటికి చెందినవారు కుట్ర పన్నారని నిర్ధరణకు వచ్చారు. హత్యలో ఇద్దరు డ్రైవర్లు, ఆర్ఎంపీ ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు.

bike lift
bike lift
author img

By

Published : Sep 20, 2022, 7:37 PM IST

Updated : Sep 20, 2022, 10:20 PM IST

Khammam bike lift incident: లిఫ్ట్ ఇచ్చిన పాపానికి విషం ఇంజక్షన్ గుచ్చి చంపిన ఘటన ఖమ్మంలో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ హత్య మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఘటన జరిగిన 24 గంటల్లోనే పోలీసులు ఆధారాలు సేకరించారు. ఘటన సంచలనం కావడంతో ఖమ్మం సీపీ ప్రత్యేక దృష్టి సారించారు. హత్య కేసు ఛేదనకు 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.

Strainger kills biker after giving lift in khammam case update
ఖమ్మం బైక్‌ లిఫ్ట్ ఘటనలో పోలీసుల దర్యాప్తు

ఖమ్మం జిల్లా చింతకాని మండలం మున్నేటికి చెందినవారు కుట్ర పన్నారని నిర్ధరణ అయింది. జమాల్ సాహెబ్‌ను చంపేందుకు పక్కా ప్రణాళిక రచించినట్లు వెల్లడైంది. నిందితుల్లో ఇద్దరు డ్రైవర్లు, ఆర్ఎంపీ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మొదటి నుంచి ఈ హత్యకు ప్రధానంగా వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు భావించారు. ఆ కోణంలోనే పూర్తిగా కేసు విచారణను చేపట్టారు. అనుకున్నట్లుగానే అదే కారణమని తేలింది. జమాల్ భార్య ఫోన్ కాల్ జాబితాలో హత్యకు పాల్పడ్డ నిందితుల నంబర్లు ఉండటం , వారితోనే ఎక్కువసార్లు మాట్లాడటం.. ఇవన్నీ పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు బుధవారం పోలీసులు ప్రెస్‌మీట్ ద్వారా వెల్లడించనున్నారు.

అసలు ఏం జరిగిందంటే... ఖమ్మం జిల్లా చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన జమాల్ సాహెబ్ ఏపీలోని జగ్గయ్యపేట మండలం గండ్రాయిలో ఉంటున్న కూతురు ఇంటికి బైక్​పై బయలుదేరాడు. ముదిగొండ మండలం వల్లభి కాటమయ్య దేవస్థానం సమీపంలోకి రాగానే రోడ్డుపై నిలిచి ఉన్న ఓ వ్యక్తి చేయిచూపి జమాల్ సాహెబ్‌ను లిఫ్ట్ అడిగాడు. సాటిమనిషికిసాయం చేద్దామన్న సదుద్దేశంతో జమాల్ సాహెబ్ గుర్తుతెలియని వ్యక్తికి లిఫ్ట్ ఇచ్చారు.

ఆ తర్వాత బైక్ కదిలి 100 మీటర్లు వెళ్లిందో లేదో... గుర్తు తెలియని వ్యక్తి బైక్ దిగి మరో బైక్​పై వెళ్లిపోయాడు. కొద్దిసేపటికే కిందపడిపోయిన జమాల్ సాహెబ్‌ను గమనించిన స్థానికులు వల్లభి ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తాను లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి తనకు ఇంజక్షన్ చేశాడని బాధితుడు స్థానికులకు చెప్పాడు. తన కుటుంబీకులకు ఫోన్ చేయమని వారికి సెల్ ఫోన్ కూడా ఇచ్చాడు. స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాతపడ్డాడు.

ఇవీ చదవండి..

Last Updated : Sep 20, 2022, 10:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.