ETV Bharat / crime

ఓటీపీలు రావు.. సమాచారం అందదు.. ఖాతా ఖాళీ! - Cybercrime latest scam

ఓటీపీలు రావు... సమాచారం అందదు.. ఖాతాదారుడి ప్రమేయం లేకుండానే నగదు బదిలీ అవుతుంది. ఇది సైబర్‌ నేరస్థుల సరికొత్త మోసం.

ఓటీపీలు రావు.. సమాచారం అందదు.. ఖాతా ఖాళీ!

author img

By

Published : Jan 26, 2021, 6:49 AM IST

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. హిమాయత్‌నగర్‌లో నివాసముంటున్న ఓ వ్యక్తి తన ఖాతాలో రూ.58 వేలు తగ్గినట్లు కొద్దిరోజుల క్రితం గుర్తించి బ్యాంకు అధికారులను సంప్రదించారు.

మీరే కోడా పేమెంట్స్‌కు విడతల వారీగా నగదు బదిలీ చేశారని వారు పేర్కొనడంతో అవాక్కయ్యారు. ఖాతా హ్యాక్‌ అయిందనే అనుమానంతో ఆయన స్మార్ట్‌ ఫోన్‌ స్థానంలో సాధారణ సెల్‌ఫోన్‌, ప్రస్తుతం వాడుతున్న ల్యాప్‌టాప్‌ స్థానంలో మరో ల్యాప్‌టాప్‌ను ఉపయోగిస్తున్నారు. ఇంట్లో వినియోగించే వైఫై కంపెనీనీ మార్చేశారు.

ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా నాలుగు రోజుల కిందట ఆయన ఖాతాలో మరో రూ.51 వేలు తగ్గాయి. దీంతో రెండు రోజుల క్రితం సదరు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంక్షిప్త సందేశాలు.. ఓటీపీలు, యూపీఐలతో మాయ చేస్తున్న సైబర్‌ నేరస్థులు.. ఇప్పుడు ఈ తరహాలో సరికొత్త పంథాలో మోసానికి తెరలేపారు. ఇంటర్నెట్‌ బ్యాంకు ఖాతాదారులే లక్ష్యంగా రూ.లక్షలు కొల్లగొడుతున్నారు. నగదు బదిలీ చేసినా, ఇంటర్నెట్‌ ద్వారా ఏదైనా వస్తువు కొన్నా.. ఓటీపీ లేదా యూపీఐ తప్పనిసరి.

ఇవేవీ లేకుండానే బాధితుల ఖాతాల్లోంచి నగదు మాయమవుతోంది. పోలీసులకూ ఈ కొత్త తరహా మోసం అంతుబట్టడం లేదు. ఈ తరహా మోసంపై వరుసగా ఫిర్యాదులు వస్తుండడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణలో కోడా పేమెంట్‌్్స, కోడా షాప్‌ పేరుతో ఉన్న క్రీడల యాప్‌ ఇందుకు కారణమని గుర్తించారు. బాధితులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోకపోయినా గేమ్‌లు కొనుగోలు చేసినట్లు వరుసగా బాధితుల ఖాతాలోంచి నగదు నిల్వలు తగ్గుతున్నాయి. దీనిపై పోలీసులు ఆరా తీసినా సరైన సమాచారం లభించటం లేదు. మరోవైపు నాలుగు రోజుల్లో ఆరుగురు బాధితులు ఇదే మోసంపై పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో పోలీసులు బ్యాంక్‌ అధికారులతో సంప్రదించి..ఆ నగదు ఎక్కడికి బదిలీ అయింది? ఏయే ఖాతాల్లోకి వెళ్లిందన్న అంశాలపై సమాచారం ఇవ్వాలని కోరారు. చైనా గేమింగ్‌ యాప్‌లకు, వీటికి ఏమైనా సంబంధం ఉందా? అన్న కోణంలో పరిశోధిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.