ETV Bharat / crime

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంపై రాళ్ల దాడి

author img

By

Published : Jan 31, 2021, 5:22 PM IST

Updated : Jan 31, 2021, 7:20 PM IST

Stone attack on MLA Challa Dharmareddy's residence
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంపై రాళ్ల దాడి

17:19 January 31

వరంగల్​ రూరల్​ జిల్లా హన్మకొండలోని పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ధర్మారెడ్డి ఇంటిపై భాజపా కార్యకర్తలు రాళ్లు, కుర్చీలు, కోడి గుడ్లతో దాడి చేశారు. ఇంట్లోని పూలకుండీలు, అద్దాలు ధ్వంసం చేశారు. రామమందిరం నిధుల సేకరణపై ఎమ్మెల్యే ధర్మారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ భాజపా శ్రేణుల ఆందోళన చేపట్టాయి. ఇంటి ముందు బైఠాయించి..  ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. 

ధర్మారెడ్డి ఏమన్నారు...

శ్రీరాముడి పేరుతో భాజపా రాజకీయం చేస్తోందని.. వాళ్లే కాదు తామూ హిందువులమేనంటూ ఎమ్మెల్యే ధర్మారెడ్డి వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడిని అపవిత్రం చేస్తున్నారని మండిపడ్డారు. దేవుడి పేరుతో భాజపా నాయకులు, కార్యకర్తలు జవాబుదారీతనం లేకుండా డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. వసూలు చేస్తున్న డబ్బుల లెక్కలు చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. భాజపా అంటే శ్రీ రాముడు... శ్రీ రాముడు అంటే భాజపా అన్న చందంగా వారు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 

ఇవీచూడండి: శ్రీరాముడి పేరుతో భాజపా రాజకీయాలు: చల్లా ధర్మారెడ్డి

Last Updated : Jan 31, 2021, 7:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.