ఫోర్జరీ దస్త్రాలతో రుణాలు పొంది బ్యాంకులను మోసం చేస్తున్న భార్యాభర్తలపై సీబీఐ కేసు నమోదు చేసింది. హైదరాబాద్కు చెందిన పరుచూరి కుమార్ అలియాస్ కనుగంటి సురేశ్ కుమార్, ఆయన భార్య పోకల పల్లవి మోసపూరితంగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని మోసం చేస్తున్నట్లు సీబీఐకి ఎస్బీఐ ఫిర్యాదు చేసింది.
తమ బ్యాంకును రూ.4 కోట్ల 80 లక్షల మోసం చేశారని ఎస్బీఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ హైదరాబాద్ విభాగం కేసు నమోదు చేసింది. ఎస్బీఐ అధికారి అబ్ధుల్ రవూఫ్ పాషా, బ్యాంకు ప్యానెల్ న్యాయవాదులు పి.ఉమాపతి రావు, కె.హరిహర్ బాబును కూడా నిందితులుగా చేర్చారు.