ETV Bharat / crime

జోరుగా ఐపీఎల్​ బెట్టింగు... పది మంది యువకుల అరెస్ట్​... - నిజామాబాద్ తాజా వార్తలు

IPL Betting: ఐపీఎల్-15 ఫైనల్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న పది మంది బెట్టింగ్ రాయుల్ని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 7 లక్షల పైచిలుకు నగదు, 4 ద్విచక్ర వాహనాలు, చరవాణులు, ల్యాప్​టాప్, బెట్టింగ్‌ బోర్డులు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

IPL Betting
IPL Betting
author img

By

Published : May 30, 2022, 12:59 PM IST

IPL Betting: రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రాంతాలలో నిన్న రాత్రి ఐపీఎల్ ఫైనల్ నేఫథ్యంలో ఆన్​లైన్ క్రికెట్ బెట్టింగ్​కి పాల్పడిన పలువురిని టాస్క్​పోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్‌లోని మియాపూర్‌, బాచుపల్లి ప్రాంతాల్లో ఆన్‌లైన్‌ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు నిందుతుల్ని మాదాపూర్ ఎస్​వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 7 లక్షల నగదు, సెల్‌ఫోన్లు, ల్యాప్​టాప్, బెట్టింగ్‌ బోర్డులు స్వాధీనం చేసుకున్నారు. నిన్న రాత్రి ఐపీఎల్​ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుండగా... బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడి చేసి ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. మరో ఇద్దరు క్రికెట్ బెట్టింగ్‌ సూత్రధారులు రామకృష్ణ, మనోహర్ పరారీ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని అతిధి బార్​లో నిన్న రాత్రి ఐపీఎల్​ బెట్టింగ్​కి పాల్పడుతున్నారన్న... పక్క సమాచారం మేరకు టాస్క్​ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో బెట్టింగ్​కి దిగిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 12వేల 700 నగదు, 4 ద్విచక్ర వాహనాలు, 6 చరవాణిలను స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చదవండి:'నీతో కాపురం నా వల్ల కాదు'.. 25 ఏళ్ల తర్వాత భర్తపై ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.