ETV Bharat / crime

Son Killed Mother in Medak: బైక్ కొనివ్వలేదని... కన్నతల్లినే కడతేర్చాడు - ద్విచక్రవాహనం కోసం తల్లిని చంపిన కొడుకు

Son Killed Mother in Medak: నవమాసాలు మోసి కనిపెంచిన కుమారుడే తన పాలిట యముడవుతాడని ఆ తల్లి ఊహించలేకపోయింది. పంచప్రాణాలు అతడే అనుకుని బతుకుతున్న ఆ తల్లి తెలుసుకోలేకపోయింది తన ప్రాణాన్ని తనయుడే తీస్తాడని. వృద్ధాప్యంలో ఆసరాగా ఉండాల్సింది పోయి.. కన్నతల్లి అనే కనికరం లేకుండా ద్విచక్ర వాహనం కోసం డబ్బులు ఇవ్వలేదని... మద్యం మత్తులో విచక్షణారహితంగా ఆమె గొంతు నులిమి హతమార్చాడు.

Son Killed Mother in Medak
Son Killed Mother in Medak
author img

By

Published : Mar 23, 2022, 12:03 PM IST

Son Killed Mother in Medak: ద్విచక్రవాహనం కోసం తనయుడు తల్లిని హతమార్చిన ఘటన.. ఘటన మెదక్ జిల్లా నిజాంపేట మండలం నార్లాపూర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.

ఏం జరిగిందంటే..

Son Killed Mother for Bike: నిజాంపేట ఏఎస్ఐ ప్రతాప్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంపేట మండలం నార్లాపూర్ గ్రామానికి చెందిన మిర్దొడ్డి పోచవ్వ(76)ను చిన్న కుమారుడు కుమార్ ద్విచక్రవాహనం కొనుక్కోడానికి బంగారం, కమ్మలు ఇవ్వాలని అడిగాడు. అందుకు తల్లి నిరాకరించడంతో గొంతు నులిమి హత్య చేసినట్లు విచారణలో తేలిందని ఏఎస్​ఐ తెలిపారు. మృతురాలి పెద్ద కుమారుడు నర్సింహులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి తుఫ్రాన్​పేట ఇన్​చార్జీ సీఐ శ్రీధర్, రామాయంపేట ఎస్సై రాజేష్ , క్లూస్ టీం చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.

ఇదీ చదవండి:తోడబుట్టిన సోదరిపై సోదరుడు కత్తులతో దాడి... కారణం అదేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.