ETV Bharat / crime

Software Comapany Cheating: బ్యాక్​డోర్​ ఉద్యోగాల పేరిట సాఫ్ట్​వేర్ కంపెనీ టోకరా

Software Comapany Cheating: బ్యాక్​డోర్ ఉద్యోగాలు అంటూ లక్షల రూపాయలు పుచ్చుకుని తీరా ఎగనామం పెట్టిందో సాఫ్ట్​వేర్ కంపెనీ. రెండు నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి.. ఆ తర్వాత ప్లేటు ఫిరాయించినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్​లో ఓ సాఫ్ట్​వేర్ కంపెనీ చేసిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.

Cheating
Cheating
author img

By

Published : May 30, 2022, 9:13 PM IST

బ్యాక్​డోర్​ ఉద్యోగాల పేరిట సాఫ్ట్​వేర్ కంపెనీ టోకరా

Software Comapany Cheating: హైదరాబాద్ మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ నిరుద్యోగులను మోసం చేసింది. ఇన్నోహబ్‌ అనే సంస్థ బ్యాక్‌డోర్‌ ద్వారా రూ. 2 లక్షలు తీసుకుని ఉద్యోగం ఇచ్చారని... రెండు నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి జీతాలు ఇచ్చారని బాధితులు తెలిపారు. రెండు వారాల క్రితం కంపెనీ వెబ్‌సైట్‌, మెయిల్స్‌ బ్లాక్‌ చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థకు సంబంధించి ఉద్యోగులు బోర్డు లేకపోవడంతో మోసపోయామని గ్రహించి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు.

ఈనెల 28న హన్మకొండకు చెందిన యువకుడు ఫిర్యాదు చేశాడని మాదాపూర్ సీఐ రవీంద్ర ప్రసాద్‌ అన్నారు. కొత్తగూడలో ఇన్నోహాబ్‌ టెక్నాలజీ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీ నిరుద్యోగుల నుంచి లక్షన్నరకు పైగా వసూలు చేసి తర్వాత మెయిల్స్ బ్లాక్ చేశారని రవీంద్ర ప్రసాద్ తెలిపారు. ఉద్యోగం ఇచ్చిన తర్వాత వర్క్ ఫ్రమ్‌ హోం అని చెప్పారని సీఐ పేర్కొన్నారు. బ్యాక్ డోర్ ఉద్యోగాలను నమ్మవద్దని సీఐ స్పష్టం చేశారు. ప్రస్తుతం కంపెనీకి సంబంధించి కమలేశ్​ కుమారి, రాహుల్‌ అలోక్‌, వైష్ణవి, ముద్ర, ప్రదీప్‌గా గురించామని వీరంతా హెచ్‌ఆర్‌, మేనేజ్‌మెంట్‌లకు సంబంధించి వాళ్లుగా సీఐ వివరించారు.

మేమే కాదు మా లాగా 2వేల మంది మోసపోయారు. ప్రతి ఒక్కరం రూ. 2 లక్షలు కట్టాం. ఈ స్కామ్​లో దాదాపు 15 మంది దాకా ప్రమేయం ఉంది. ఒక సంవత్సరం నుంచే వీరు ముందస్తు ప్రణాళిక ప్రకారం ఇదంతా చేశారు. కంపెనీ మెయిల్స్, వ్యక్తిగత మెయిల్స్ బ్లాక్ చేశారు. మాకు అనుమానం వచ్చి కంపెనీ వద్దకు వచ్చి చూస్తే అసలు ఇక్కడ కంపెనీనే లేదు. కన్సల్టెంట్ మెంబర్ ద్వారా దాదాపు 500 మందిని రిక్రూట్ చేసుకున్నారు. ఉద్యోగంలో చేరినా కూడా ఇప్పటివరకు జీతాలు ఇవ్వలేదు. -- బాధితులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.