ETV Bharat / crime

Sirpurkar Commission Enquiry: దిశ కేసు.. '12 మంది కళ్లలో మట్టి కొట్టాడు'! - హైదరాబాద్​ వార్తలు

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ ( Disha Encounter Case News) కేసుపై సిర్పుర్కర్ కమిషన్ (Sirpurkar Commission Enquiry Continues on Disha Encounter) విచారణ కొనసాగుతోంది. ఎన్​కౌంటర్​ ఉదంతంపై అబ్దుల్​ రవూఫ్​ అనే ప్రత్యక్ష సాక్షిని సిర్పూర్కర్​ (sirpurkar commission) కమిషన్​ ప్రశ్నించింది.

Sirpurkar Commission Enquiry
దిశ నిందితుల ఎన్‌కౌంటర్
author img

By

Published : Oct 2, 2021, 7:18 AM IST

Updated : Oct 2, 2021, 7:40 AM IST

‘దిశ’ హత్యాచారం కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ (Sirpurkar Enquiry Continues on Disha Encounter) ఉదంతంపై అబ్దుల్‌ రవూఫ్‌ అనే ప్రత్యక్ష సాక్షి (Sirpurkar Commission Enquiry Eyewitness on Disha Encounter) శుక్రవారం జస్టిస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ (sirpurkar commission) ఎదుట వాంగ్మూలమిచ్చారు. కమిషన్‌ తరఫు న్యాయవాదులు పరమేశ్వర్‌, విరూపాక్ష గౌడ అడిగిన ప్రశ్నలకు రవూఫ్‌ సమాధానాలిచ్చారు. ‘దిశ’కు సంబంధించిన వస్తువులను దాచిన ప్రాంతాన్ని చూపిస్తానని నిందితుడు ఆరిఫ్‌ చెప్పడంతో పోలీసుల వెంట తానూ చటాన్‌పల్లికి వెళ్లానని చెప్పారు. వస్తువుల్ని వెతికే క్రమంలో ఆరిఫ్‌ రెండు చేతులతో మట్టి విసరడంతో 12 మంది కళ్లలో పడిందని చెప్పారు. తర్వాత నిందితులు రాళ్లు, కర్రలతో దాడి చేశారని పేర్కొన్నారు. ఆరిఫ్‌, చెన్నకేశవులు సీఐ, ఎస్సైల నుంచి ఆయుధాలు లాక్కునేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. అంతమంది పోలీసులు నిందితుల్ని నిలువరించే ప్రయత్నం చేయలేదా? అని న్యాయవాదులు ప్రశ్నించారు. తన కళ్లలో మట్టి పడటంతో గమనించలేదని రవూఫ్‌ చెప్పారు. కాల్పులు జరిగిన సమయంలో మీరెంత దూరంలో ఉన్నారు.? అని అడిగితే 3-4 అడుగుల దూరంలో ఉన్నానని బదులిచ్చారు. ఈ సందర్భంగా న్యాయవాదులు ఘటనాస్థలి ఫొటోలను చూపించి ఆ ప్రాంతాన్ని గుర్తుపట్టమని అడిగారు. నిందితుల వాంగ్మూలంలో లేని విషయాలు.. మీ స్టేట్‌మెంట్‌లో ఎందుకున్నాయని ప్రశ్నించగా, దానిని ఎలా నమోదు చేసుకున్నారో తనకు తెలియదని అన్నారు.

ఆన్‌లైన్‌ విచారణలోకి చొరబాటు యత్నం..!

‘దిశ’ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ ఉదంతంపై త్రిసభ్య కమిషన్‌ (sirpurkar commission) జరుపుతున్న విచారణలోకి చొరబాటుయత్నం జరిగింది. కమిషన్‌ (sirpurkar commission) సభ్యులు దిల్లీ, ముంబయి నుంచి ఆన్‌లైన్‌లో విచారణ జరపుతుండగా.. సాక్షులు తెలంగాణ హైకోర్టు నుంచి హాజరవుతున్నారు. శుక్రవారం కమిషన్‌ (sirpurkar commission) కంప్యూటర్‌పై పాప్‌అప్‌ నోటిఫికేషన్లు ప్రత్యక్షమయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఆన్‌లైన్‌ విచారణలో చొరబాటుకు యత్నిస్తున్నట్లు అనుమానించిన కమిషన్‌ (sirpurkar commission) వెంటనే అప్రమత్తమైంది. ఎంక్వైరీ ప్రోసీడింగ్‌లను యాక్సెస్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానంతో విచారణను పర్యవేక్షిస్తున్న కమిషన్‌ (sirpurkar commission) కార్యదర్శి శశిధర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లింది. చొరబాటు యత్నంపై దర్యాప్తు చేయాలని స్టేట్‌ కౌన్సిల్‌ ఉమామహేశ్వరరావుకు సూచించింది. హైకోర్టు ప్రాంగణంలో ఉన్న కమిషన్‌ (sirpurkar commission) కార్యాలయంలోని వైఫై పాస్‌వర్డ్‌ను ఇతరులు వినియోగించడం వల్ల ఇలా జరిగి ఉంటుందనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.

న్యాయవాదిపై ఆగ్రహం

కాల్పుల సమయంలో ఏ వైపు ఉన్నారని అడిగిన ప్రశ్నకు రవూఫ్‌ తూర్పున అని చెప్పారు. ఓ న్యాయవాది పశ్చిమం అని చెప్పడంతో వెంటనే రవూఫ్‌ మాట మార్చారు. ఈ విషయంలో ఆ న్యాయవాదిపై కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్ని వెరిఫై చేయాలని ఆదేశించింది. అంతకుముందు గాంధీ ఆసుపత్రి ఫొరెన్సిక్‌ నిపుణుడు కృపాల్‌సింగ్‌ను న్యాయవాదులు విచారించారు. ‘పాయింట్‌ రేంజ్‌ ఫైరింగ్‌’ గురించి తెలుసా అని అడిగితే బాలిస్టిక్‌ నిపుణులకే ఆ విషయం తెలుస్తుందన్నారు.

ఇదీ చూడండి: Disha Encounter Case News: బుల్లెట్లు ఎంత దూరం దూసుకొచ్చాయ్.. ఎలా దిగాయ్​?

justice sirpurkar commission: దిశ ఎన్‌కౌంటర్‌ కేసులో సజ్జనార్‌ విచారణ వాయిదా..

sirpurkar commission: ఎన్‌హెచ్‌ఆర్సీ బృందంపై సిర్పూర్కర్‌ కమిషన్‌ అసహనం

justice sirpurkar commission: దిశ కేసులో ప్రశ్నల వర్షం.. 29న విచారణకు సజ్జనార్!

Sirpurkar Commission: దిశ ఎన్‌కౌంటర్ కేసులో విచారణ వేగవంతం.. సీపీ మహేష్ భగవత్‌పై ప్రశ్నల వర్షం

Last Updated : Oct 2, 2021, 7:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.