ETV Bharat / crime

మద్యం మత్తులో యువత చిందులు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

author img

By

Published : Jun 15, 2021, 1:26 PM IST

నిబంధనలకు విరుద్ధంగా బర్త్ ​డే పార్టీ చేసుకున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతీ యువకులు మద్యం సేవించి చిందులు వేస్తున్నారన్న పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి వారిని పట్టుకున్నారు.

shamshabad dcp arrested 64 members who violates lockdown rules
మద్యం మత్తులో యువతీ యువకుల చిందులు..

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కడ్తాల్​ గ్రామ శివారులోని బాక్స్​ అనే ఫాంహౌస్​లో లాక్​డౌన్​ నిబంధనలకు విరుద్ధంగా పార్టీ చేసుకుంటున్న 64 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరుణ్​ అనే వ్యక్తి తన పుట్టిన రోజును వేడుకగా చేసుకునేందుకు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. ఐటీ ఉద్యోగులు, కాలేజీల్లో చదువుకునే యువతులు 63 మంది పార్టీకి హాజరయ్యారు. అందరూ కలిసి మద్యం మత్తులో బాక్స్​ ఫాంహౌస్​లో చిందులు తొక్కారు.

ఫాంహౌస్​లో నిబంధనలకు విరుద్ధంగా పార్టీ జరుగుతున్న సమాచారం అందుకున్న పోలీసులు... దాడులు నిర్వహించి 64 మందిని అదుపులోకి తీసుకున్నారు. అందులో 21 మంది యువతులు ఉన్నట్లు శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి తెలిపారు. మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. జిషాన్ అలిఖాన్ అనే వ్యక్తిపై బహుదుర్ పురా, పంజాగుట్ట, నాంపల్లి పీఎస్​లలో గతంలో పలు కేసులు ఉండగా అతనిపై రౌడీషీట్ నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు. బర్త్ డే పార్టీలో పాల్గొన్న విద్యార్థుల కాలేజీలతో పాటు ఐటీ ఉద్యోగాల ఆఫీసులకు లేఖలు రాస్తామన్నారు.

ఇదీ చూడండి: Suicide: కరోనా టీకా వేసుకోమన్నారని.. యువకుడు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.