ETV Bharat / crime

Sexual Harassment: వివాహితపై కామాంధుడి దాష్టికం.. కోరిక తీర్చాలంటూ నెలరోజులుగా.. - తెలంగాణ వార్తలు

Sexual Harassment in Prakasam district: ఆమెకు రెండేళ్ల క్రితం వివాహమైంది. అయిదు నెలల బాబు ఉన్నాడు. ఓ కామాంధుడు తన కోరిక తీర్చాలంటూ నెల రోజులుగా వెంటపడుతున్నాడు. తనకు అధికార బలం ఉందని, ఎవరూ ఏమీ చేయలేరంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. భయపడిన ఆమె పోలీసులను ఆశ్రయించి రక్షణ కల్పించాలని ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న కామాంధుడు తనపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ వివాహితతో పాటు ఆమె తల్లిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అయినా పోలీసుల నుంచి ఇంతవరకు చర్యలు లేవు.

Sexual Harassment on woman, prakasam sexual harassment
బాలింతపై కామాంధుడి దాష్టికం
author img

By

Published : Dec 24, 2021, 9:45 AM IST

Sexual Harassment on Married Woman in Prakasam district : పసిబిడ్డ తల్లిని... తన కోరిక తీర్చాలంటూ నెల రోజులుగా ఓ కామాంధుడు వెంటపడుతున్నాడు. బరితెగించిన ఆ కామాంధుడు అసభ్యకరంగా మాట్లాడుతూ.. మానసికంగా, శారీరకంగా వేధిస్తున్న ఘటన ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో గురువారం వెలుగులోకి వచ్చింది. కనిగిరి మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహితను ఇదే ప్రాంతంలోని తాళ్లూరుకు చెందిన సీహెచ్‌ ఏడుకొండలు వేధిస్తున్నాడు. ఆమె భర్తకు ఫోన్‌ చేసి ఆమెను తన వద్దకు పంపాలంటూ బెదిరించాడు. అతడి వేధింపులు తట్టుకోలేక గత నెల 28వ తేదీన ఆమె కనిగిరి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. అయినా చర్యలు లేకపోవడంతో ఈనెల 17న జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ‘స్పందన’ కార్యక్రమంలో మరోమారు వినతి అందించారు.

నా పైనే కేసు పెడతారా అంటూ దాడి...

Sexual Harassment in Prakasam district: అక్కడినుంచి కనిగిరి చేరుకొని తల్లితో కలిసి ఆమె నడిచివస్తుండగా స్థానిక పామూరు బస్టాండ్‌ సమీపంలో ఏడుకొండలు అడ్డుకున్నాడు. నా పైనే కేసు పెడతారా అంటూ రక్తమొచ్చేలా వారిద్దరినీ కొట్టాడు. ‘కుటుంబాన్ని ఊళ్లో లేకుండా చేస్తా.. నీ భర్తను తరిమేస్తా’ అని తీవ్రంగా హెచ్చరించాడు. ఆస్పత్రిలో చికిత్స తీసుకొని ఆమె మరోమారు కనిగిరి పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో దాడి కేసు నమోదు చేశారు.

చర్యలేవీ...

అయినా ఏడుకొండలుపై ఎటువంటి చర్యలు లేకపోవడంతో గురువారం కుటుంబ సభ్యులంతా కనిగిరిలోని రజక సంఘం నాయకులను కలిసి తమ గోడు వినిపించారు. ఈ విషయమై ఎస్సై జి.రామిరెడ్డిని వివరణ కోరగా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని.. ప్రస్తుతం విచారిస్తున్నట్లు తెలిపారు. వేధింపులకు పాల్పడుతున్న ఏడుకొండలును వెంటనే అరెస్టు చేయకపోతే రజక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని నాయకులు కోమటిగుంట్ల చెన్నయ్య, వెంకటేశ్వర్లు హెచ్చరించారు.

ఇదీ చదవండి: విషాదం... పిల్లలతో సహా ఉరేసుకుని తండ్రి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.